సన్రైజ్ స్టేట్ ఏపీలో టీసీఎల్ క్లస్టర్..
- December 19, 2018
సన్రైజ్ స్టేట్ ఏపీకి ప్రపంచ కంపెనీలు తరలివస్తున్నాయి. ఏడాదికి 60 లక్షల టివిల తయారీ లక్ష్యంగా ప్రపంచ ప్రసిద్ధ టీసీఎల్ కార్యకలాపాలు తిరుపతిలో ప్రారంభం కానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా ఈ నెల 20 తేదీన టీసీఎల్కు భూమిపూజ జరగనుంది. తిరుపతి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ సమీపంలో 158 ఎకరాల్లో టీసీఎల్ కంపెనీ ఏర్పాటు కానుంది. టీసీఎల్ రాకతో 8 వేల మందికి ఉద్యోగాలు రానున్నాయి.
శ్రీవారి ఆలయంతో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుపతి ఇప్పుడు టీసీఎల్ రాకతో ఎలక్ట్రానిక్స్ హబ్ గా మారబోతోంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీ కోసం టీసీఎల్ సంస్థ ఏపీలో 2,200 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. డిసెంబర్ 2019 కి కంపెనీ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో టీసీఎల్ పనులు ప్రారంభిస్తోంది. ఈ నెల 20న చంద్రబాబు టీసీఎల్కు భూమిపూజ చేయనున్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో కార్యక్రమంలో టీసీఎల్ ఛైర్మెన్ లీ డాంగ్ షెన్గ్ పాల్గొననున్నారు.
టీసీఎల్ కంపెనీ ఏపీకి తీసుకురావడం వెనుక ఐటీ మంత్రి నారా లోకేష్ అలుపెరుగని కృషి ఉంది. లోకేష్ ముందుచూపు, పక్కా ప్రణాళికతో టీసీఎల్ యాజమాన్యాన్ని రాష్ట్రానికి రావడానికి ఒప్పించగలిగారు. టీవీలు,స్మార్ట్ ఫోన్లు, వాషింగ్ మేషిన్లు, ఫ్రిజ్ వంటి కన్స్యూమర్ ఎలక్ర్టానిక్స్ తయారీలో అంతర్జాతీయంగా టీసీఎల్ కంపెనీకి మంచి పేరుంది. ప్రపంచవ్యాప్తంగా టిసిఎల్ కంపెనీలలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. టివి ప్యానల్స్ తయారీ లో ప్రపంచంలోనే మూడవ స్థానంలో ఉంది.ఇప్పుడు తిరుపతిలో ఏర్పాటు చేసే టీసీఎల్ కంపెనీతో వేలాది మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందనున్నారు.
నాలుగేళ్లలో ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అభివృద్ధి కి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు,తీసుకొచ్చిన పాలసీలు,ఏపీ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉండటం వలన ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం వేగంగా అభివృద్ధి చెందింది. సెల్ కాన్,డిక్సన్,కార్బన్ కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించాయి.585 కోట్ల పెట్టుబడితో 6,600 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఫ్లెక్స్ ట్రానిక్స్ కంపెనీ త్వరలోనే కంపెనీ నిర్మాణం ప్రారంభించబోతుంది.ఆంధ్రప్రదేశ్ లో రిలయన్స్ జియో అతి పెద్ద పెట్టుబడి పెట్టనుంది. 15 వేల కోట్ల పెట్టుబడితో, 20 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కంపెనీ ఏర్పాటు చేయనుంది.తిరుపతిలో 150 ఎకరాల్లో రిలయన్స్ జియో ఎలక్ట్రానిక్స్ పార్క్ ని ఏర్పాటు చేయనుంది. త్వరలోనే రిలయన్స్ జియో భూమి పూజ కూడా జరగనుంది.సన్నీ ఓపోటెక్ కూడా 500 కోట్ల పెట్టుబడి,4000 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ లో త్వరలోనే కంపెనీ ఏర్పాటు చేయనుంది.తిరుపతిలో 75 ఎకరాల్లో 1400 కోట్ల పెట్టుబడితో 6 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ కెమెరా మాడ్యూల్స్,స్క్రీన్స్ తయారీ కంపెనీ హోలీ టెక్ కూడా తిరుపతి లో కంపెనీ నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించనుంది.కేవలం అసెంబ్లీ తో ఆగిపోకుండా ఎలక్ట్రానిక్స్ తయారీ లో వినియోగించే ప్లాస్టిక్స్ నుండి సర్క్యూట్ బోర్డ్ తయారీ వరకూ అన్ని కంపెనీ లను ఆంధ్రప్రదేశ్ కి తీసుకురావాలి అనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!