సీఎం కుమార్ స్వామి ఇంట్లో బాంబ్: అప్రమత్తమైన పోలీసు బలగాలు

- December 19, 2018 , by Maagulf
సీఎం కుమార్ స్వామి ఇంట్లో బాంబ్: అప్రమత్తమైన పోలీసు బలగాలు

కర్ణాటక: కన్నడ పోలీసులను ఓ ఫోన్ కాల్ పరుగులు పెట్టించింది. సీఎం కుమారస్వామి ఇంట్లో బాంబు పెట్టారని..ఆ బాంబ్ కొద్ది సమయంలోనే పేలనుందని పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీస్ అధికారులు ఆగమేఘాలమీద ఉరుకులు పరుగులు పెట్టారు. ఫోన్ కాల్ పై అప్రమత్తమై బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో వెళ్లిన పోలీసులు, తనిఖీల అనంతరం అదో ఫేక్ కాల్ అని తేల్చారు. ఆపై ఫోన్ నంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన జేపీ నగర్ పోలీసులు, మన్సూర్ అనే యువకుడిని అరెస్ట్ చేశారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అతను గోపాల్ గా మార్చి చెప్పాడని పోలీస్ విచారణలో వెల్లడయ్యింది. కాగా ఎందుకు ఫోన్ చేశాడనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కాగా ఇటువంటి ఫేక్ కాల్స్ చేయటం ఆకతాయిలకు కామన్ గా మారిపోయింది. ఇటువంటి ఘటనలు గతంలో పలు సందర్భాలలో జరిగిన విషయం తెలిసిందే. గుర్తింపు కోసమో లేక ఆటపట్టిద్దామనో ఆకతాయిలు ఇటువంటి ఫేక్ కాల్స్ చేస్తుంటారు. కానీ అదే నిజమైతే..ఫేక్ అని పోలీసులు భావిస్తే..నష్టం మాత్రం భారీగా వుండొచ్చు. కాబట్టి ఫేక్ కాల్స్ తో తప్పుదారి పట్టించటం సరికాదనే విషయం తెలుసుకోవాల్సిన అవసరముందని గుర్తించాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com