గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక ప్యాకేజ్ కేటాయించాలి
- December 19, 2018
తెలంగాణ:అంతర్జాతీయ వలస దారుల దినోత్సవం సందర్భంగా నిన్న అర్మూర్లో జరిగిన సమావేశానికి ప్రవాస హక్కులు మరియు సంక్షేమ వేదిక దుబాయ్ యూనిట్ నుండి సంస్థ అధ్యక్షులు రమేష్ ఏముల సూచన మేరకు అరుణ్ కుమార్ -ప్రధాన కార్యదర్శి మరియు దండు గణేష్ -కార్యవర్గ సభ్యులు పాల్గొనడం జరిగింది.
వలస బాదితుల ఆశా జ్యోతి పెద్దన్న ,మా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు -నర్సింహం నాయుడు కోటపాటి మాట్లాడుతూ......
అన్ని కులాలను అన్ని వర్గాలను ఆదుకుంటున్న తెలంగాణ ప్రబుత్వం గల్ఫ్ కార్మికుల కష్టాలను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. గల్ఫ్ లో సాటి కార్మికుడు ఏదైనా ప్రమాద వశాత్తు చనిపోతే ఆ మృత దేహాన్ని ఇంటికి రప్పించేదుకు అయ్యే ఖర్చును సాటి కార్మికులే చందాలు వేసుకొని ఆ వ్యయాన్ని భరిస్తున్నారన్నారు.
కొందరికి సకాలంలో డబ్బులు జమ కాకపొయేసరికి చాలా రోజులు మృతి చెందిన వ్యక్తి యొక్క భౌతిక కాయం ఇంటికి చేరుకోలేక నెలలు సంవత్సరాలు గడుస్తున్నాయని ఆ కుటుంబ సబ్యుల రోదన వర్ణనాతీతం అని మాటలకు అందనిదని అన్నారు. ఇటువంటి పరుస్తితుల నుంచి గల్ఫ్ కార్మికుల ను ఆదుకొని సమగ్రమైన NRI పాలసీ ప్రకటించి అమలు జేయాలని కోరారు.
కవితమ్మ చొరవతో జాగృతి ఆద్వర్యంలో కొన్ని సమస్యలు తీరుతున్నప్పటికీ సంపూర్ణమైన పరిష్కారం లభించడం లేదని గుర్తు చేశారు. ఇతర పార్టీ లు ఎన్ని ఆశలు చెప్పినా గల్ఫ్ కార్మికులందరు టీఆరెస్ పార్టీ ని కేసీఆర్, కేటీఆర్, కవితమ్మ నాయకత్వాన్ని నమ్మి రెండవ సారి టీఆరెస్ పార్టీ కి అఖండ విజయాన్ని సాధించి పెట్టారని గుర్తు చేశారు.
స్థానిక mla లు వేముల ప్రశాంత్ రెడ్డి ,జీవన్ రెడ్డి ల సహకారంతో త్వరలోనే సంపూర్ణ NRI పాలసీ అమలవుతుందన్న ఆశాబావాన్ని వ్యక్తం చేశారు..
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!