పెరుగుతున్న మధుమేహులు
- December 23, 2015
డయాబెటిస్ (మధుమేహం)పై మరింత అవగాహన కల్పించవలసి ఉందని సుప్రీం కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అభిప్రాయపడింది. 40 ఏళ్ళలోపు వారూ ఎక్కువగా మధుమేహం బారిన పడ్తుండడం ఆందోళన కల్గించే విషయమని పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు. ఫిట్నెస్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్ 14వ ఎడిషన్లో హెల్త్ ఎడ్యుకేటర్ ఖాజా యూసుఫ్ అలీ మాట్లాడుతూ, చాలామంది తమ ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనీ, చాలామందికి తాము డయాబెటిస్తో బాధపడ్తున్నామన్న విషయం కూడా తెలియదని అన్నారు. పెరుగుతున్న మానసిక ఒత్తిడి, తగ్గుతున్న ఫిజికల్ యాక్టివిటీ, సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, ఆహారంలో సోడియం ఎక్కువగా ఉండటం వంటివన్నీ మధుమేహానికి కారణమని చెప్పారాయన. 30 ఏళ్ళలోపు యువతీ యువకులు హైపర్టెన్షన్ (బీపీ), డయాబెటిస్ (షుగర్) వ్యాధులతో బాధపడ్తుండడం ఆందోళనకరమని అన్నారు. ఖతార్లో అందరికీ ఆరోగ్యం పట్ల అవగాహన పెంచేందుకు పలు కార్యక్రమాలు చేపడ్తున్నామనీ, మెడికల్ చెకప్ క్యాంప్స్ ఇంకా విస్తృతంగా జరగాల్సి ఉందని చెప్పారాయన. ఎస్పైర్ పార్క్ వద్ద 4 గంటల నుంచి 7 గంటల వరకు పఫిట్నెస్ అండ్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ నిర్వహించబడుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









