అల్ మార్కియా స్ట్రీట్ తాతాలిక, పాక్షిక మూసివేత
- December 20, 2018
ఖతార్: అల్ ఇస్తికాల్ స్ట్రీట్ మరియు అల్ జమియా స్ట్రీట్ మధ్యనున్న అల్ మఖ్రియా స్ట్రీట్‌ని తాత్కాలికంగా, అలాగే పాక్షికంగా మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్, అష్గల్ ఈ మూసివేతను అమలు చేస్తున్నాయి. డిసెంబర్ 20 నుంచి జనవరి 7 వరకు అల్ జామియా స్ట్రీట్ డైరెక్షన్లో అల్ ఇస్తికాల్ స్ట్రీట్ వైపు అల్ మార్కియా స్ట్రీట్‌పై ఒక ప్రధాన లేన్ని మూసివేస్తారు. మిగతా రెండు మెయిన్ లైన్స్‌పై ట్రాఫిక్ యధాతథంగా కొనసాగుతుంది. డిసెంబర్ 20 నుంచి 30 డిసెంబర్ వరకు అల్ మార్ఖియా స్ట్రీట్ నుంచి అల్ జమియా స్ట్రీట్ వైపు వెళ్ళే రెండు లెఫ్ట్ టర్న్ లేన్స్ మూసివేయడ్తాయి. మరో లెఫ్ట్ టర్న్‌పై ట్రాఫిక్ యదాతథంగా కొనసాగుతుంది. స్టార్మ్ వాటర్ డ్రైనేజ్ నెట్‌వర్క్స్‌కి సంబంధించిన ప్రాజెక్ట్ ఫేస్ 2 పూర్తి చేయడం కోసం ఈ చర్యలు చేపడుతున్నారు. రోడ్ యూజర్స్ స్పీడ్ లిమిట్స్ పాటించాలనీ, అధికారులకు సహకరించాలని అష్గల్ సూచించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







