ఎన్టీఆర్ బయోపిక్ ట్రైలర్ విడుదల..
- December 21, 2018టాలీవుడ్ నటుడు బాలకృష్ణ ప్రధాన పాత్రలో నందమూరి తారకరామారావు బయోపిక్ రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలుగా ప్రేక్షకుల ముందుకురానుంది. క్రిష్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. 'నేను ఉద్యోగం మానేశాను..ఎందుకు మానేశావు..నచ్చలేదు..మరేం చేద్దామని..సినిమాల్లోకి వెళతాను..నిన్ను చూడటానికి జనాలు టికెట్లు కొనుక్కొని థియేటర్లకు వస్తున్నారు..ఇలా నువ్వే వెళ్లి కనిపిస్తే నీ సినిమాలు ఎవరు చూస్తారు..జనం కోసమే సినిమా అనుకున్నాను..ఆ జనానికే అడ్డమైతే సినిమా కూడా వద్దంటాను' అంటూ వచ్చే డైలాగ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉన్నాయి. ఓ వైపు సినిమాలు..మరో వైపు రాజకీయ ప్రస్తానం రెండింటిని చూపిస్తూ రూపొందించిన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్‌ను రెండు పార్టులుగా విడుదల కానుంది. మొదటి భాగం 'కథానాయకుడు' చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనుండగా..'మహానాయకుడు' సినిమా రిపబ్లిక్ డే కానుకగా జనవరి 24న విడుదల కానుంది.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ