నేషనల్ డే ట్రేడ్ ఫెస్టివల్ గ్రేట్ సక్సెస్
- December 22, 2018
కతర్: మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, నేషనల్ టూరిజం కౌన్సిల్‌తో కలిసి నేషనల్ డే ట్రేడ్ ఫెస్టివల్‌ని ఘనంగా నిర్వహించిన సంగతి తెల్సిందే. ఈ ఈవెంట్ గ్రాండ్‌గా ముగిసింది. ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ ఫెస్టివల్‌ని నిర్వహించారు. ఫస్ట్ ఎడిషన్ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని నిర్వాహకులు తెలిపారు. మొత్తం 14 మాల్స్, 600 ఔట్‌లెట్స్‌తో ఈ ట్రేడ్ ఫెస్టివల్ జరిగింది. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు సందర్శకుల్ని ఆకట్టుకున్నాయి. రిటెయిల్, హాస్పిటాలిటీ, లీజర్, ఎడ్యుకేషన్ సెక్టార్స్, క్లినిక్స్, మెడికల్ సెంటర్స్, బ్యూటీ సెంటర్స్, సర్వీస్ కంపెనీస్, ఇతర ఇన్‌స్టిట్యూషన్స్ ఇందులో పాల్గొన్నాయి. అంచనాలకు మించి సందర్శకుల తాకిడి కన్పించిందనీ, ట్రేడ్ యాక్టివిటీస్ పాల్గొన్న సంస్థల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







