బాలీవుడ్ లో అడుగుపెట్టనున్న విజయ్ దేవరకొండ!
- December 22, 2018
విజయ్ దేవరకొండ.. పెళ్ళి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలతో అతని క్రేజ్ కొండెక్కి కూర్చుంది. అర్జున్ రెడ్డిని బాలీవుడ్లో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తుండడంతో, విజయ్ గురించి హిందీ ఆడియన్స్‌కి కూడా తెలిసింది. మొన్నీ మధ్య కాఫీ విత్ కరణ్ షోలో జాన్వీ కపూర్ కూడా విజయ్ పేరు చెప్పడం చూసాం. విజయ్ దేవరకొండ ఇప్పుడు ఏకంగా ఓ బాలీవుడ్ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. రణ్వీర్ సింగ్, డైరెక్టర్ కబీర్ ఖాన్ కాంబినేషన్లో క్రికెట్ దిగ్గజం, కపిల్ దేవ్ బయోపిక్ రూపొందనున్న సంగతి తెలిసిందే. రణ్వీర్ ప్రస్తుతం రోహిత్ షెట్టి డైరెక్షన్లో సింబా మూవీలో నటిస్తున్నాడు. తెలుగు టెంపర్కిది హిందీ రీమేక్. దాని తర్వాత రణ్వీర్ సింగ్, '83లో, కపిల్ దేవ్ పాత్రలో నటించనున్నాడు. ఈ మూవీలో ప్రముఖ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ క్యారెక్టర్లో, టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండని నటింపచెయ్యడానికి మూవీ యూనిట్ ప్రయత్నిస్తుందని, విజయ్ దేవరకొండ కూడా శ్రీకాంత్ క్యారెక్టర్ చెయ్యడానికి ఓకే చెప్పాడని తెలుస్తుంది. ఇదే కనక నిజమైతే, విజయ్ దేవరకొండని క్రేజ్ ఏ రేంజ్కెళ్తుందో ఊహించడం కష్టం. రణ్వీర్ సింగ్ సింబా ఈనెల 28న రిలీజ్ అవనుంది. ఆ తర్వాత కపిల్ దేవ్ బయోపిక్ స్టార్ట్ అవుతుంది.
తాజా వార్తలు
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..