సౌక్ వకిఫ్ స్ప్రింగ్ ఫెస్టివల్ ప్రారంభం
- December 22, 2018
నేషనల్ డే సెలబ్రేషన్స్ తర్వాత ఖతార్‌లో మరో ఈవెంట్ ఘనంగా ప్రారంభమయ్యింది. ఖతార్‌లో ప్రముఖమైన సౌక్ ఫెస్టివ్ మూడ్‌తో కళకళ్ళాడుతోంది. సౌక్ వకిఫ్ స్ప్రింగ్ ఫెస్టివల్ ప్రారంభమవడంతో సందర్శకుల్లో కొత్త ఉత్సాహం కన్పిస్తోంది. ఈ ఏడాది కూడా గతంలోలానే పలు ఆకర్షణలు ఈ ఫెస్టివల్లో కొలువుదీరాయి. గేమ్స్, రైడ్స్, కాన్సెర్ట్స్, షోస్‌తో సౌక్ ఫెస్టివల్ సందర్శకుల్ని అలరిస్తోంది. 15 రోజుల పాటు సాగే ఈ ఫెస్టివల్లో సర్కస్ మరో ప్రధాన ఆకర్షణ. ఇందులో ఆక్రోబాట్స్, జగ్లర్స్, మేజీషియన్స్ ఇతర కళాకారులు.. ఈ ఫెస్టివల్లో సందర్శకుల్ని అలరించనున్నారు. ఈ షోస్ కోసం 30, 50 మరియు 70 ఖతారీ రియాల్స్ ధరతో టిక్కెట్లు లభ్యమవుతాయి. పిల్లలతోపాటు పెద్దలకూ కార్నివాల్లో బోల్డన్ని ఆకర్షణీయమైన అంశాలున్నాయి. ఫుడ్ కోర్ట్ పలు రకాలైన స్పెషల్ వంటకాలతో సందర్శకులకు చవులూరిస్తున్నాయి.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా