కాసేపట్లో విశాఖకు పయనమవ్వనున్న తెలంగాణ దొర

- December 23, 2018 , by Maagulf
కాసేపట్లో విశాఖకు పయనమవ్వనున్న తెలంగాణ దొర

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం విశాఖపట్నం వెళ్లనున్నారు. పెందుర్తి మండలం చినముషిడివాడలోని శ్రీశారదాపీఠాన్ని ఆయన సందర్శిస్తారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న కేసీఆర్‌..మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో చినముషిడివాడలోని శారదాపీఠానికి వెళ్తారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశీర్వచనం తీసుకుంటారు.

దాదాపు రెండు గంటలసేపు పీఠంలోనే కేసీఆర్‌ గడుపుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ ఎన్నికలకు ముందు స్వామీజీ ఆధ్వర్యంలో కేసీఆర్‌ రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. ఇక.. విశాఖ పర్యటన అనంతరం కేసీఆర్‌.. భువనేశ్వర్‌ వెళ్తారు.

కేసీఆర్‌ వ్యక్తిగత భద్రత ఏర్పాట్లను తెలంగాణ నుంచి వచ్చే బలగాలు చూసుకుంటాయని.. విశాఖ పోలీసులు బయటి భద్రతను మాత్రమే పర్యవేక్షిస్తారని అధికారులు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com