ఆహార ఉత్పత్తుల ఎగుమతి త్వరలో: కతర్
- December 24, 2018
దోహా: 2019లో కతర్, ఇతర దేశాలకు ఫుడ్ స్టఫ్‌ని ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంటుందని మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీస్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అధికారులు చెబుతున్నారు. మినిస్ట్రీ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్‌మెంట్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ అలాగే సెంటర్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ అండ్ మునిసిపల్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ బిన్ సైఫ్ అల్ కువారీ మాట్లాడుతూ, ఖతార్‌ని వివిధ దేశాలు అక్రమంగా దిగ్బంధించాక, ఖతార్‌లో ఆహారోత్పత్తుల ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టామనీ, కుట్రల్ని తిప్పి కొట్టేందుకు స్వయం సమృద్ధి దిశగా కృషి చేశామని అన్నారు. పౌల్ట్రీ సెక్టార్‌లో 100 శాతం సెల్ఫ్ సఫీయిషన్సీని సాధించగలిగామనీ, ఫ్రోజన్ పౌల్ట్రీ ప్రోడక్ట్స్ విబాగంలో 98 శాతం, డైరీ ప్రోడక్ట్స్ 85 శాతం ఉత్పత్తి చేయగలిగాయి. ఈ ఫలితాలు సంతృప్తిగా వున్నాయని చెప్పిన అల్ కువారి, కూరగాయలు, షీప్, పౌల్ట్రీ, ఇతర ఫుడ్ ప్రోడక్ట్స్ విషయంలో దేశ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి చేస్తున్నామనీ, అవసరాలకు మించి ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకున్న వెంటనే ఎక్స్‌పోర్ట్స్ ప్రారంభమవుతాయని తెలిపారు.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







