తెలంగాణ:ఉదయం 10 దాటినా సూర్యుడి జాడ లేకపోవడంతో..
- December 24, 2018
తెలంగాణను మంచు దప్పుట్లు కప్పేశాయి. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాను పొగ మంచు దట్టంగా కమ్మేసింది. ఉష్ణోగ్రతలు అంతకంతకు పడిపోతూ..చలి విజృంభిస్తుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. సూర్యాపేటలో ఈ తెల్లవారుజాము నుంచి భారీగా మంచు కురుస్తుండడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంచు కారణంగా రోడ్లు సరిగా కనబడకపోవడంతో.. వాహనాలను రోడ్డు పక్కనే ఆపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇటు హైదరాబాద్ పరిసర ప్రాంతాలను కూడా పొగ మంచు దట్టంగా అలుముకుంది. ముఖ్యంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ గ్రామాల్లో మంచు కప్పేసింది. ఉదయం 10 దాటినా సూర్యుడి జాడ లేకపోవడంతో వాహనదారులు, మార్నింగ్ వాకర్స్ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓవైపు చలి తీవ్రత, మరోవైపు మంచు కారణంగా శంషాబాద్ పరిసర ప్రాంతాలు ఊటీని తలపిస్తున్నాయి.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్