నిర్బంధంలో వున్న భారతీయ మహిళకు ఊరట
- December 24, 2018
బహ్రెయిన్:భారతీయ వలస మహిళ ఒకరు అరబ్ వ్యక్తి నిర్బంధంలో వుండగా, ఆమెను లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (ఎల్ఎంఆర్ఎ) అధికారులు విడిపించారు. అరబ్ వ్యక్తి, తాను ఆ మహిళను 'బానిస'గా కొనుగోలు చేసినట్లు పేర్కొంటున్నారు. హ్యుమానిటేరియన్ ఆర్గనైజేషన్‌ని ఆ మహిళ సంప్రదించిన తర్వాత రెస్క్యూ చర్యలు ప్రారంభమయ్యాయి. ఇండియన్ ఎక్సటర్నల్ ఎఫైర్స్ మినిస్టర్ అలాగే బహ్రెయిన్ అధికారులకు ముందుగా ఈ సమాచారాన్ని అందించారు. ఓ రూమ్‌లో మహిళను బంధించారు అరబ్ వ్యక్తి. సమాచారం గురించి తెలుసుకున్న భారత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, పరిస్థితి చాలా తీవ్రంగా వుందనీ, వెంటనే తగు చర్యలు తీసుకోవాలని భారత రాయబారి అలోక్‌కుమార్ సిన్హాకి ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఇండియన్ ఎంబసీ, ఈ విషయంలో జోక్యం చేసుకుని, బహ్రెయిన్ అధికారులతో కలిసి బాధిత మహిళకు విముక్తి కల్పించారు.a
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!