యూఏఈ పర్యటనకు రాహుల్..!
- December 24, 2018
యూఏఈ:ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంతో పాటు ఫలితాలపై సమీక్షలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ఎంపికతో తీరికలేకుండా గడిపిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ త్వరలో యూఏఈ పర్యటనకు వెళ్లనున్నారు. వచ్చే ఏడాది జనవరి 11, 12 తేదీల్లో ఆదేశంలో పర్యటించనున్నారు. దుబాయ్లో రాహుల్ గాంధీ ప్రవాస భారతీయులతో సమావేశమవుతారని ఏఐసీసీ కార్యదర్శి హిమాన్షు వ్యాస్ తెలిపారు. అంతకుముందే ఈ నెలాఖరులో దుబాయ్ వెళ్లి రాహుల్ పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు జనసమీకరణకు సన్నాహాలు చేయనున్నట్లు ఆయన వివరించారు.రాహుల్ దుబాయ్ పర్యటన మాత్రం కచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా వ్యాస్ పేర్కొన్నారు. షార్జా వర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగిస్తారని సమాచారం. లోక్సభ ఎన్నికలకు ముందు యూఏఈలో ఉన్న ప్రవాసులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంతుంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!