సెలెబ్రిటీ ని బ్లాక్ మెయిల్ చేసిన మహిళ
- December 25, 2018
దుబాయ్: ప్రమాదం ఎప్పుడు ఎలా చుట్టుముడుతుందో తెలీని రోజులివి..ఉదాహరణ ఈ సంఘటన. దుబాయ్ లో నివసిస్తున్న అరబ్ మహిళ ఒకానొక ప్రముఖ వ్యక్తి తో పరిచయం పెంచుకొని భారీగా మోసం చేయబోయి పోలీసులకి చిక్కింది. వివరాల్లోకి వెళ్తే, ప్రముఖ వ్యక్తి తో ఒక అరబ్ మహిళకు ఇంస్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్లకి ఇరువురు తమ ఫోన్ నుంబర్లను కూడా షేర్ చేసుకున్నారు. అటుపై వాట్సాప్ లో వీరి పరిచయం ముదిరి ఏకంగా తన అస్లీల వీడియోను మహిళకు పంపించాడు ఆ ప్రముఖ వ్యక్తి. ఇదే ఆసరాగా చేసుకొని ఆ వీడియోను 'యూట్యూబ్' లో పెట్టేసి ఆ వ్యక్తి వద్దనుండి భారీ నగదు బ్లాక్ మెయిల్ చేసింది. తన అస్లీల వీడియోను 'యూట్యూబ్' లో చుసిన వ్యక్తి ఉలిక్కిపడి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసాడు. 'సైబర్ క్రైమ్' వెంటనే స్పందించి ఆ వీడియోను తొలగించి ఆపై మహిళపై కేసు నమోదు చేశారు.
అపరిచిత వ్యక్తులకు తమ వ్యక్తిగత వివరాలు (వయసు, ఆర్ధిక) తెలపవద్దని; అలాగే తెలీని నంబర్ల నుండి వచ్చే ఫోన్ కాల్స్ ను కూడా జాగ్రత్తగా వ్యవహరించండి అని అధికారులు తెలిపారు. ఏదైనా అవాంఛిత సంఘటనలు జరిగితే వెనువెంటనే 8004888 నంబరుకు ఫిర్యాదు చేయచ్చు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!