వెండితెరపై 'మిసైల్ మేన్' బయోపిక్!
- December 26, 2018బాలీవుడ్లోనేకాదు సౌత్‌లోనూ ఇప్పుడు బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. ఆటగాళ్ల లైఫ్ స్టోరీల గురించి రకరకాల సినిమాలు అభిమానులను అలరించాయి. బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టాయి. ఈ నేపథ్యంలో మిసైల్ మేన్, పీపుల్స్ ప్రెసిడెంట్ అబ్దుల్‌కలాం జీవితం మీద సినిమాని సౌత్‌తోపాటు హిందీలోనూ తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కలాం రోల్లో బాలీవుడ్ నటుడు అనిల్‌కపూర్ నటిస్తాడని సమాచారం. కొద్దిరోజుల కిందట ఫిల్మ్ మేకర్స్.. అనిల్కపూర్ని కలిసి స్క్రిప్ట్ వినిపించడం, ఆయనకు నచ్చడంతో ఈ బయోపిక్ చేసేందుకు ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌పై అఫీషియల్‌గా ప్రకటన రానుంది. అంతా అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్ళడం ఖాయం. అనిల్ సుంకర- అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా దీన్ని నిర్మించనున్నారు. కలాం జీవిత చరిత్రపై రాజ్ చెంగప్ప రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కనుంది.
తాజా వార్తలు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు
- మస్కట్ ఎయిర్పోర్ట్...దక్షిణ రన్‌వే ప్రారంభం
- అక్రమ రవాణా కేసులో ఆఫ్రికన్ మహిళకు జైలుశిక్ష
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం