పెట్రోల్‌ స్టేషన్‌లో దోపిడీ: ఇద్దరి అరెస్ట్‌

- December 26, 2018 , by Maagulf
పెట్రోల్‌ స్టేషన్‌లో దోపిడీ: ఇద్దరి అరెస్ట్‌

మస్కట్‌: పెట్రోల్‌ స్టేషన్‌లో దోపిడీకి పాల్పడ్డ ఇద్దరు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. దోపిడీకి పాల్పడటమే కాకుండా, పెట్రోల్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న వర్కర్స్‌పైనా నిందితులు దాడికి దిగారు. విలాయత్‌ ఆఫ్‌ బురైమిలో ఈ ఘటన జరిగింది. అల్‌ బురైమి గవర్నరేట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్స్‌ ఇద్దరు అనుమానితుల్ని అరెస్ట్‌ చేసిందని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ ఆన్‌లైన్‌ ద్వారా ఓ ప్రకటనలో పేర్కొంది. విలాయత్‌ బురైమిలోని ఒమన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com