ఒమన్ చేరుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్
- December 27, 2018
మస్కట్: ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ (ఐసిజిఎస్) విక్రమ్, మస్కట్ చేరుకుంది. మూడు రోజుల గుడ్ విల్ విజిట్‌లో భాగంగా విక్రమ్, ఒమన్ చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సుల్తానేట్‌లో ఇండియా అంబాసిడర్ మును మహావర్, ఐసిజిఎస్ విక్రమ్‌పై రిసెప్షన్ ఏర్పాటు చేశారు. మెరిటైమ్ సెక్యూరిటీ విషయంలో భారత్ అన్ని విధాలా ఒమన్‌కి సహకరిస్తుందని ఇండియన్ ఎంబసీ ఈ సందర్భంగా పేర్కొంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, అలాగే రాయల్ ఒమన్ పోలీస్ కోస్ట్ గార్డ్ మధ్య సన్నిహిత సంబంధాలు మరింత పెరిగే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడ్తుందని అధికారులు పేర్కొన్నారు. ఐసిజిఎస్ విక్రమ్, 98 మీటర్స్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెస్సెల్ సిరీస్‌లో భాగం. ఇటీవలే దీన్ని కమిషన్ చేశారు. మొత్తంగా ఈ వెస్సెల్‌లో 100 మంది పనిచేస్తారు. రాజ్ కమల్ సిన్హా కమాండెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







