భూటాన్‌కు 4500 కోట్ల సాయం ప్రకటించిన మోదీ
- December 28, 2018
భూటాన్ దేశానికి భారత్ 4500 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తెలిపారు. ఇవాళ భూటాన్ ప్రధాని లొటాయ్ సెరింగ్ ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. ద్వైపాక్షిక సంబంధాల్లో భూటాన్ హైడ్రో పవర్ సహకారం కీలకం అని మోదీ అన్నారు. మంగడేచ్చు ప్రాజెక్టును పనులు త్వరలోనే పూర్తి చేయనున్నట్లు ఆయన చెప్పారు. గత నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సెరింగ్ ఘన విజయం సాధించారు. భూటాన్ అభివృద్ధి కోసం తాము కట్టుబడి ఉన్నామని మోదీ అన్నారు. 12వ పంచవర్ష ప్రణాళికలో 4500 కోట్లు కేటాయించనున్నట్లు ప్రధాని తెలిపారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







