ఉదయాన్నే నిమ్మరసం తాగితే...

- December 29, 2018 , by Maagulf
ఉదయాన్నే నిమ్మరసం తాగితే...

ప్రస్తుత కాలంలో ఉరుకుల పరుగుల ప్రపంచంలో నిద్ర లేవడంతోనే బిజీ బిజీగా పనులలో మునిగిపోతున్నారు. అందువల్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఉదయం లేవడంతోనే కాఫీ, టీలతో రోజుని ప్రారంభిస్తున్నారు. కాఫి, టీలు నిద్రమత్తుని వదిలించడానికి, యాక్టివ్‌గా ఉండడానికి సహకరిస్తాయి కానీ వీటికంటే ముందు నిద్ర లేవడంతోనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగడం వల్ల అనేక రకములైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

1. పరగడుపున తేనె నిమ్మరసం
త్రాగడం వలన గ్యాస్ట్రో సిస్టం మెరుగు పడుతుంది. దీనివలన శరీరం న్యూట్రిషన్లు మరియు ఇతర మినరల్స్ గ్రహించే శక్తి
పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం మెరుగు పడడంతో పాటుగా, వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.

2. నిమ్మలో ఉండే ఆల్కలైన్ లక్షణాలు శరీరంలోని టాక్సిక్‌లను నిర్మూలించే సాధనంగా చేస్తాయి. నిమ్మ అసిడిక్‌గా అనిపించినప్పటికీ దీనిలోని మంచి గుణాలు శరీరంలో పిహెచ్ విలువలను సమతుల్యం చేయడంలో చాలా ఉపయోగపడుతుంది.
3. పొద్దున్నే ఒక గ్లాస్ నిమ్మ రసం తాగడం వలన కడుపు ఖాళీ అయి ప్రశాంతతను సమకూరుస్తుంది. ముందు రోజు మసాలాలు లాంటివి తిన్నప్పుడు అవన్నీ శుభ్రం అయి కడుపు ఉబ్బరం, అలజడి, అల్సర్లు లాంటివి రాకుండా చేయడంలో కూడా నిమ్మ ఎంతగానో సహాయపడుతుంది.

4. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఒక ప్రత్యేక ఫైబర్ అనే పదార్థం ఉండటం వలన ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఒక దివ్యౌషధంలా పని చేస్తుంది. దీంతో మెటబాలిజం కూడా మెరుగుపడి ఆకలి నియంత్రణకు దారి తీస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు తేనె నిమ్మరసం తాగడం వలన మంచి ఫలితం ఉంటుంది.
5. నిమ్మలో ఉండే విటమిన్ సి జలుబు, అనేక రకములైన ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది. మొత్తానికి
పరగడుపున తేనె నిమ్మరసం తాగడం వలన సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com