4 ఏళ్ళ చిన్నారి హత్యకేసు: తల్లికి ఊరట
- December 29, 2018
కువైట్ సిటీ: కోర్ట్ ఆఫ్ కాస్సేషన్, లోవర్ కోర్ట్ ఇచ్చిన తీర్పుని కొట్టి పారేసింది. కేసు వివరాల్లోకి వెళితే, నాలుగేళ్ళ చిన్నారి హత్య కేసులో ఆమె తల్లిని దోషిగా లోవర్ కోర్ట్ తేల్చడమే కాకుండా, నాలుగేళ్ళ జైలు శిక్ష విధించింది. ఇదిలా వుంటే, క్రిమినల్ కోర్ట్, బ్లాగర్ సకర్ అల్ హషాష్కి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది. స్టేట్ సెక్యూరిటీ మరియ సైబర్ క్రైమ్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను న్యాయస్థానం ఆమెను దోషిగా తేల్చింది. మొత్తంగా అల్ హషాష్పై 70 ఏళ్ళ జైలు శిక్ష విధించినట్లయ్యింది. కాగా, క్రిమినల్ కోర్ట్ కువైట్ ఎయిర్ వేస్ కార్పొరేషన్ సేల్స్ స్టాఫ్‌కి ఏడేళ్ళ జైలు శిక్ష, 126,000 కువైటీ దినార్స్ జరీమానా విధించింది న్యాయస్థానం. అలాగే ఉద్యోగం నుంచి తొలగించాలనీ ఆదేశాలు జారీ చేసింది. ఫోర్జ్డ్ ప్లేన్ టిక్కెట్స్‌ని విక్రయించడం, 64,000 కువైటీ దినార్స్ మోసానికి పాల్పడటం వంటి కేసులు ఈయనపై నమోదయ్యాయి.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా