వ్యాట్‌ ఛార్జ్‌: స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌ క్షమాపణ

- December 29, 2018 , by Maagulf
వ్యాట్‌ ఛార్జ్‌: స్కూల్‌ అడ్మినిస్ట్రేషన్‌ క్షమాపణ

బహ్రెయిన్: కింగ్‌డమ్‌లో ఓ ఎడ్యుకేషనల్‌ ఫెసిలిటీ, తమ సేవలకుగాను వ్యాట్‌ని ఛార్జ్‌ చేసిన దరిమిలా, క్షమాపణ చెప్పింది. సదరు స్కూల్‌ ఛార్జ్‌ చేసిన వ్యాట్‌పై పబ్లిక్‌ అండ్‌ అథారిటీస్‌ స్కూటినీ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూల్‌ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎడ్యుకేషనల్‌ సర్వీసులు - వ్యాట్‌ అంశంపై సరైన అవగాహన లేకనే స్కూల్‌ తమ సేవలపై వ్యాట్‌ని ఛార్జ్‌ చేసిందని స్కూల్‌ వర్గాలు వెల్లడించాయి. సోషల్‌ మీడియాలో ఈ వ్యాట్‌పై చర్చ జరగడంతో, మినిస్ట్రీ ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. కాగా, మినిస్ట్రీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ప్రైవేట్‌ ఎడ్యుకేషన్‌కి సదరు స్కూల్‌ క్షమాపణ చెబుతూ లేఖ రాసింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com