ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. కేసీఆర్ సంచలన వ్యాఖ్య
- December 29, 2018
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సంచలన ప్రకటన చేశారు . తాను ఏపీ ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు . ఇటీవల తెలంగాణలో కేసీఆర్ విజయాన్ని ఏపీలో వైసీపీ , జనసేన శ్రేణులు సెలబ్రేట్ చేసుకుంటున్నాయని .. ప్రత్యేక హోదా అడ్డుకుంటున్న కేసీఆర్ గెలిస్తే వీరికి సంతోషం ఎందుకని చంద్రబాబు తరచూ విమర్శిస్తున్నారు.
శనివారం మీడియాతో ఈ విషయంపై విస్తృతంగా మాట్లాడిన చంద్రబాబు .. తాను ఎప్పుడూ ప్రత్యేక హోదాను అడ్డుకోలేదని .. వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు . తన పార్టీ పార్లమెంట్ సహా అనేక వేదికలపై ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని చెప్పిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు . తమ పార్టీ నేతలు కె . కేశవరావు , కవిత , జితేందర్‌రెడ్డి అనేక సార్లు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటనలు చేశారన్నారు.
అసలు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే స్పష్టంగా ఉందని కేసీఆర్ వివరించారు . ఈ చట్టంలోని సెక్షన్ 94 లోని 1, 2 క్లాజుల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు రాష్ట్రాలకూ పన్నురాయితీలు ఇవ్వాలని .. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని క్లియర్ గా ఉందని గుర్తు చేశారు . అవసరమైతే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి తాను ఉత్తరం రాసేందుకు కూడా సిద్దమని కేసీఆర్ చెప్పారు .
అసలు ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబుకే క్లారిటీ లేదని విమర్శించారు . మొన్నటి వరకూ మోడీ చంకనెక్కిన చంద్రబాబు .. ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పిన విషయం మరిచిపోరాదన్నారు . హోదా పెరెత్తితే జైల్లో పెడతానని హెచ్చరించిన రోజులు మర్చిపోయారా అని కేసీఆర్ ప్రశ్నించారు .
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!