12 గంటల పాటు మూసుకున్న జగన్నాథ ఆలయం
- December 30, 2018
ప్రపంచ ప్రఖ్యాత పూరీ జగన్నాథ ఆలయంలో పూజారులు ఆందోళనకు దిగారు. విధుల్లో ఉన్న పోలీసు పూజారిపై దాడి చేశాడని ఆరోపిస్తూ, ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేశారు. ఆలయ పూజారి తన వెంట ఓ భక్తుడిని గర్భాలయంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ భక్తుడు విదేశీయుడని అక్కడే విధుల్లో ఉన్న పోలీసు భావించాడు. ఈ విషయంపై పోలీసు, పూజారి మధ్య వాగ్వాదం నెలకొంది. పోలీసు తనపై దాడికి దిగాడని ఆరోపించడంతో మిగతా పూజారులు విధులు బహిష్కరించి, గర్బాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుపై 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జేపీ దాస్ హామీ ఇవ్వడంతో పూజారులు తమ ఆందోళనను విరమించారు. సుమారు 900 సంవత్సరాల చరిత్ర కలిగి జగన్నాథ ఆలయం రోజు ఉదయం 5గంటలకు తెరచి భక్తులకు దర్శనం కల్పిస్తారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!