ప్రముఖ దర్శకుడి కన్నుమూత
- December 30, 2018
కోల్‌కతా: ఇండియన్ సినిమా చూసిన అత్యున్నత దర్శకుల్లో ఒకరైన బెంగాలీ డైరెక్టర్ మృనాల్ సేన్ ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు ఉదయం పదిన్నర గంటల సమయంలో గుండెపోటు వచ్చింది. మృనాల్ సేన్ వయసు 95 ఏళ్లు. మృనాల్ సేన్‌కు 2005లో ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు కూడా వచ్చింది. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉన్న ఫరీద్‌పూర్‌లో మృనాల్ జన్మించారు. 1956లో రాత్ భోర్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆకాశ్ కుసుమ్ (1965), భువన్ షోమ్ (1969), కలకత్తా 71, ఇంటర్వ్యూ (1971), ఖాందహార్ (1974), కోరస్ (1975), మృగయ (1977), అకలేర్ సాంధనె (1981), ఏక్ దిన్ అచానక్ (1989)లాంటి సినిమాలను ఆయన తెరకెక్కించారు. 2002లో వచ్చిన ఆమర్ భువన్ మృనాల్ సేన్ చివరి సినిమా.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!