జనవరి 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పని చేయదు!
- December 31, 2018
జనవరి 1, 2019 నుంచి వాట్సాప్ కొన్ని ఫోన్లలో పని చేయదని కంపెనీ వెల్లడించింది. ఈ పని చేయని ఫోన్లలో అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌ల పాత వెర్షన్లు ఉన్నాయి. నోకియా ఎస్40తోపాటు విండోస్ ఫోన్ 7, ఐఫోన్ ఐఓఎస్ 6, నోకియా సింబియాన్ 60లలో మంగళవారం నుంచి వాట్సాప్ పని చేయదు. ఇక ఆండ్రాయిడ్ ఓఎస్‌లో వెర్షన్ 2.3.7, అంతకంటే ముందు వెర్షన్లు ఉన్న ఫోన్లలో, ఐఓఎస్ 7, అంతకన్నా ముందు వెర్షన్లు ఉన్న ఐఫోన్లలో 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సాప్ పని చేయదని కంపెనీ స్పష్టం చేసింది. ఐఓఎస్ 7 ప్రస్తుతం ఐఫోన్ 4, ఐఫోన్ 4ఎస్, ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ, ఐఫోన్ 5ఎస్‌లలో ఉంది. ఈ ప్లాట్‌ఫామ్‌లు భవిష్యత్తులో తమ యాప్ ఫీచర్లను అందుకోలేవని వాట్సాప్ చెప్పింది. ఈ వెర్షన్ ఫోన్లు వాడేవాళ్లు కొత్త వెర్షన్లకు అప్డేట్ కావాలని సూచించింది. ఆండ్రాయిడ్ అయితే కనీసం 4+, ఐఫోన్ అయితే ఐఓఎస్ 7+, విండోస్ అయితే కనీసం 8.1+ వెర్షన్లు ఉండాలని వాట్సాప్ తెలిపింది. జియో ఫోన్, జియో ఫోన్ 2లలోనూ వాట్సాప్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!