ఏటీఎంలో క్యాష్ నిల్.. ఎస్‌బీఐకి జరిమానా
- January 02, 2019
ముంబై: ఖాతాదారుల అకౌంట్లో మినిమం బాలెన్స్ లేకపోతే ఛార్జీలు వసూలు చేయడం గురించి అందరికీ తెలుసు. అయితే ఏటీఎంలో క్యాష్ లేకపోవడంతో బ్యాంకుకే జరిమానా పడింది. ఏటీఎంలో నగదు లేదని ఓ వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదుతో అత్యధిక ఖాతాదారుల గల దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐకి వినియోగదారుల ఫోరం 2,500 రూపాయల జరిమానా విధించింది.
రాయపూర్‌కు చెందిన వినియోగదారుడు ఏటిఎంలో నగదు విత్‌డ్రా కోసం వెళ్లినప్పుడు ‘నో క్యాష్ అవైలబుల్’ మెసేజ్ కనిపించింది. ఇలా అతడికి మూడుసార్లు కనిపించడంతో విసిగిపోయిన సదరు వినియోగదారుడు.. వినియోగదారుల ఫోరాన్ని ఆశ్నయించాడు. ఏటీఏంలో నగదు అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత సదరు బ్యాంకులకు ఉందని వినియోగదారుల ఫోరం పేర్కొంది.
ఏటీఎంలో క్యాష్ లభించకపోవడంపై వినియోగదారుల ఫోరం ఎస్‌బీఐని ప్రశ్నించింది. అయితే కేవలం ఇంటర్‌నెట్ వైఫల్యమని, దీనికి సర్వీసు ప్రొవైడర్ బాధ్యత వహించాలన్న ఎస్‌బీఐ వాదనను తోసి పుచ్చింది. అలాగే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని యూజర్ల నుంచి ఏడాదిలో ముందే ఛార్జి వసూలు చేస్తున్నపుడు ఏటీఎంలలో నగదు లేకుండా ఏలా చేస్తారని ప్రశ్నించింది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!