విమానంలో ఒకే ప్రయాణికురాలిగా లూసియా ఎరిస్పే
- January 03, 2019
ఫిలిప్పీన్స్: ఓ విమానంలో ఒంటరిగా ప్రయాణిస్తే... బాగా డబ్బుండి చార్టెడ్ విమానాన్ని అద్దెకు తీసుకుని వెళ్లగలిగిన వారైతే ఇది సాధ్యమే. కానీ, మామూలు ప్యాసింజర్ విమానంలో ఇది జరగాలంటే... అసలు ఊహకే అందదుకదా? ఫిలిప్పీన్స్ కు చెందిన లూసియా ఎరిస్పే ఈ కలను సాకారం చేసుకుంది. అసలు విషయాన్ని, తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. లూసియా ఎరిస్పే, దావో నుంచి మనిలా వెళ్లేందుకు టికెట్ బుక్ చేసుకుంది. ఫిలిప్పీన్స్ ఎయిర్ లైన్స్ పీఆర్ 2820 అనే విమానం కోసం ఎదురుచూసి, విమానం రాగానే, లోపలికి ఎక్కింది. చుట్టూ ఎవరూ లేరు. ప్రయాణం చేస్తున్నది తాను ఒక్కర్తినేనని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. విమానం సిబ్బందితో సెల్ఫీలు దిగింది. ఆ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కాగా, గతంలో కరోన్ గ్రీవ్ అనే మహిళ కూడా ఇలానే విమానంలో ఒంటరిగా ప్రయాణించిన అనుభూతిని మిగుల్చుకుంది.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్