డోనాల్డ్ ట్రంప్ రహస్య పర్యటన
- January 04, 2019
టెహ్రాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాగ్దాద్‌లో ఇటీవల జరిపిన రహస్య పర్యటన ఇరాక్‌లో అమెరికా ఓటమికి ఒక తిరు గులేని తార్కాణమని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ బుధవారం వ్యాఖ్యా నించారు. ఇరాక్‌పై దురాక్రమణకు యత్నించిన అమెరికా దారుణంగా భంగపడిందని ఆయన చెప్పారు. మంత్రి వర్గ సమావేశంలో సిరియా, ఆఫ్ఘనిస్తాన్‌ల నుంచి అమెరికా సేనల ఉపసంహ రణ గురించి ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అత్యంత రహస్యంగా బాగ్దాద్‌కు రావడం, వచ్చాక కూడా సైనిక స్థావరాన్ని దాటి ఒక్క అడుగు కూడా బయటకు వెళ్లకపోవడం ఇవన్నీ ఇరాక్‌లో అమె రికా ఓటమిని తెలియజేస్తున్నా యని రౌహాని చెప్పారు. ఇరాక్‌పై యుద్ధంలో అమెరికా విజ యం సాధించలేదు. అమెరికా గురించి ఇరాక్ ప్రజలకు బాగా తెలుసు, అగ్ర రాజ్యాన్ని వారు ఎంతమాత్రమూ విశ్వసించడం లేదు. అమెరికా తీరుపై ఎంత మాత్రమూ సంతృప్తికరంగా లేరు. అమెరికా సేనలపై వారు తిరగబడుతున్నారని రౌహాని తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!