'తస్సాదియ్యా..' ప్రోమో వీడియో సాంగ్ విడుదల
- January 04, 2019
బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం వినయ విధేయ రామ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తుందని చిత్ర బృందం చెబుతుంది. అయితే ఈ చిత్రంలో తస్సాదియ్యా.. అంటూ సాగే పాటకి ఎంత రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ పాటని జస్ప్రీత్ జాజ్, మానసి ఆలపించారు. తాజాగా ఈ డ్యూయట్ సాంగ్ వీడియోని విడుదల చేశారు.ఇందులో చరణ్, కియారాలు తమ స్టెప్పులతో అదరగొట్టారు. ఈ వీడియో అభిమానులని ఆకట్టుకుంటుంది. చిత్రానికి దేవి శ్రీ అందించిన బాణీలు అద్భుతంగా ఉన్నాయి. స్నేహా, వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, అనన్య, ఆర్యన్ రాజేష్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ భామ ఈషా గుప్తా ఇందులోని ప్రత్యేక గీతంలో నటించారు. యాక్షన్‌కు ప్రాధాన్యం ఇస్తూ ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా దీన్ని తెరకెక్కించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!