15 మిలియన్ దిర్హామ్‌ల విజేతలు ఈ బెస్ట్ ఫ్రెండ్స్
- January 04, 2019
యూ.ఏ.ఈ:ఇద్దరు స్నేహితులు.. కొత్త ఏడాదిలో అత్యద్భుతమైన బహుమతిని గెల్చుకున్నారు. ఈ ఆనంద క్షణాల్ని పంచుకుంటూ జీవితంలో ఎన్నో కష్ట సుఖాల్ని కలిసే ఎదుర్కొన్నామనీ, ఇప్పుడు ఈ బహుమతిని తాము పంచుకుంటున్నందుకు ఆనందంగా వుందని చెప్పారు. 34 ఏళ్ళ శరత్ పురుషోత్తమన్, 36 ఏళ్ళ ప్రశాంత్ సురేంద్రన్.. కేరళకు చెందినవారు. ఇద్దరూ ఒకే సంస్థలో పనిచేస్తున్నారు. దుబాయ్‌లో ఈ ఇద్దరూ ఒకే రూమ్‌లో వున్నారు. కష్ట సుఖాల్లో ఇద్దరం కలిసే వున్నామనీ, ఒకరి అవసరాల్ని ఇంకొకరు తీర్చేందుకు కష్టపడ్డామని చెప్పారు. శరత్ పురుషోత్తమన్ పేరు మీద టిక్కెట్‌కి బహుమతి లభించింది. మొత్తం 15 మిలియన్ దిర్హామ్‌ల బహుమతి శరత్‌ని వరించింది. బహుమతి గెల్చుకున్న ఆనందంలో తన తల్లిని చూడాలని వుందంటున్నారు శరత్. మరోపక్క తన కుమార్తె తనకు లక్ అని ప్రశాంత్ అంటున్నారు. ఈ ఆనంద క్షణాల్లో తమ కుటుంబాలతో వుండాలని కోరుకుంటున్నామనీ, ఆ తర్వాతే ఈ బహుమతిని ఏం చేయాలనేది ఆలోచిస్తామని చెబుతున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్