ప్రవాసీ భారతీయ దివస్‌ రిజిస్ట్రేషన్‌ పొడిగింపు

ప్రవాసీ భారతీయ దివస్‌ రిజిస్ట్రేషన్‌ పొడిగింపు

మస్కట్‌: ఒమన్‌లో నివసిస్తున్న భారతీయులు, ప్రవాసీ భారతీయ దివస్‌లో పాల్గొనేందుకుగాను జనవరి 10వ తేదీ లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి వుంటుంది. తాజాగా ఈ పొడిగింపుని ఇండియన్‌ ఎంబసీ ప్రకటించింది. వారణాసిలో ప్రవాసీ భారతీయ దివస్‌ కన్వెన్షన్‌ జరగనున్న సంగతి తెల్సిందే. రెండేళ్ళకోసారి ఈ ప్రవాసీ భారతీయ దివస్‌ని నిర్వహిస్తూ వస్తున్నారు. భారత ప్రభుత్వానికీ, ఓవర్సీస్‌ ఇండియన్‌ కమ్యూనిటీకి మధ్య బంధం మరింత బలోపేతం అయ్యేందుకు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. జనవరి 21 నుంచి 23 వరకు ఈ ప్రవాసీ భారతీయ దివస్‌ జరగనుంది. 

 

Back to Top