హెరాయిన్ స్మగ్లింగ్ గుట్టు రట్టు
- January 05, 2019
అబుదాబీ పోలీస్, 231 కిలోల హెరాయిన్ స్మగ్లింగ్‌ని అడ్డుకున్నారు. ఫిషింగ్ బోటులో ఈ హెరాయిన్‌ని దేశంలోకి స్మగుల్ చేస్తున్నట్లు సమాచారం అందడంతో, అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించిన పోలీసులు స్మగ్లింగ్ అటెంప్ట్ గుట్టు రట్టు చేసి, ఇద్దరు ఆసియా జాతీయుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి 231 కిలోల హెరాయిన్‌ని అస్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసినవారిలో డ్రగ్ షిప్మెంట్ ఓనర్ కూడా వున్నారు. అబుదాబీ పోలీస్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ మక్తౌమ్ అలి అల్ షరిఫి మాట్లాడుతూ, ప్రమాదకరమైన డ్రగ్స్ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ - క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ కల్నల్ తాహెర్ ఘరీబ్ అల్ దాహిరి మాట్లాడుతూ, డ్రగ్స్ స్మగ్లింగ్‌కి సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించి నిందితుల్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్