చిలీలో కార్చిచ్చు...8 మంది మృతి
- January 06, 2019
శాంటియాగో : దక్షిణ అమెరికా దేశమైన చిలీలో కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తున్నది. మంటల్లో చిక్కుకొని 8 మంది మృతిచెందగా, వందలాది మంది గల్లంతయ్యారు. వందలాది ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కార్చిచ్చు చెలరేగిన ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు తక్షణమే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వోల్పారైసో ప్రాంతంలో భారీ ఆస్తినష్టం సంభవించిందన్నారు. లిమాచే నగర మేయర్ కార్చిచ్చు వ్యాపించిన ప్రాంతాల్లో పర్యటించారు. మృతుల కుటుంబాలను ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఓ హిగ్గిన్స్ దక్షిణ ప్రాంతంలోని 2600 హెక్టార్ల అటవీ ప్రాంతం అగ్నికి ఆహుతైందని అన్నారు. అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడిందన్నారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







