కార్‌ పార్కింగ్‌ గొడవ: పొరుగింటి వ్యక్తిపై దాడి

కార్‌ పార్కింగ్‌ గొడవ: పొరుగింటి వ్యక్తిపై దాడి

బహ్రెయినీ వ్యక్తి, పొరుగింటి వ్యక్తిపై దాడికి దిగిన కేసులో మూడు నెలల జైలు శిక్షకు గురయ్యాడు. నిందితుడికి 100 దిర్హామ్‌ల జరీమానా కూడా విధించింది న్యాయస్థానం. 2018 సెప్టెంబర్‌ 8న ఈ ఘటన జరిగింది. కారు పార్కింగ్‌ విషయమై జరిగిన గొడవ, ఈ దాడికి కారణమని విచారణలో తేలింది. నిందితుడు, బాధిత వ్యక్తిపైనా అతని కుమార్తెపైనా దాడికి దిగాడు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. వివాదానికి కారణమైన ప్రాంతానికి సంబంధించిన కేసు సివిల్‌ కోర్టులో వుంది.  

 

Back to Top