కటారాలో ఈక్వైన్‌ ఎగ్జిబిషన్‌

- January 09, 2019 , by Maagulf
కటారాలో ఈక్వైన్‌ ఎగ్జిబిషన్‌

దోహా:40 వరకూ స్టన్నింగ్‌ ఫొటోగ్రాఫ్స్‌ కటారా బిల్డింగ్‌ 18లో కొలువుదీరాయి. 'అల్‌ అదియత్‌' ఎగ్జిబిషన్‌ పేరుతో గుర్రాలకు సంబంధించిన అందమైన ఫొటోల్ని ఇక్కడ ప్రదర్శనకు వుంచారు. కటారా జనరల్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఖాలిద్‌ బిన్‌ ఇబ్రహీమ్‌ అల్‌ సులైటి, ఈ ఫొటో ఎగ్జిబిషన్‌ని ప్రారంభించారు. ఖతారీ ఫొటోగ్రాఫర్‌ ఒమర్‌ అల్‌ హమ్మాది కెమెరా నుంచి వచ్చిన అద్భుతమైన ఫొటోలు ఈ ప్రదర్శనలో కొలువుదీరాయనీ, యూత్‌ హాబీ సెంటర్‌ (వైహెచ్‌సి) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందనీ కటారా జనరల్‌ మేనేజర్‌ చెప్పారు. ఖతార అలాగే యూరోప్‌ మరియు యూకేలలో ఈ ఫొటోల్ని తీశారు ఫొటోగ్రాఫర్‌. ప్రాచీన అరబ్‌ వర్డ్‌ 'అల్‌ అదియత్‌' నుంచి ఈ ఎగ్జిబిషన్‌ పేరుని తీసుకున్నారు.దీని అర్థం 'హార్సెస్‌ స్టార్మింగ్‌ ఎ బ్యాటిల్‌ ఫీల్డ్‌' అని. అరేబియన్‌ కల్చర్‌లో గుర్రానికి ఎంతో ప్రాధాన్యత వుంది. 2009లో తాను ఈక్విన్‌ ఫొటోగ్రఫీని హాబీగా మలచుకున్నట్లు ఫొటోగ్రాఫర్‌ హమ్మాద్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com