రెసిడెన్సీ చట్ట ఉల్లంఘనలు 109,721
- January 09, 2019
కువైట్ సిటీ: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెసిడెన్స్ ఎఫైర్స్ వెల్లడించిన తాజా గణాంకాల్ని బట్టి చూస్తే, జనవరి నాటికి మొత్తం రెసిడెన్సీ వయొలేటర్స్ సంఖ్య 109,721గా కన్పిస్తోంది. ఇందులో 61,506 మంది పురుషులు, 48,215 మంది మహిళలు వున్నారు. ఆర్టికల్ 20 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడిన డొమెస్టిక్ వర్కర్స్ సంఖ్య 48,965 కాగా, ఆర్టికల్ 18 ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడినవారి సంఖ్య 29,426గా వుంది. ఆర్టికల్ 14 (టెంపరరీ రెసిడెన్స్) ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 22,401గా తెలుస్తోంది. ఆర్టికల్ 22 ఉల్లంఘనకు పాల్పడినవారి సంఖ్య 7,387. ఆర్టికల్ 17 ఉల్లంఘనకు 1091 మంది పాల్పడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్టికల్ ఇది. సెక్యూరిటీ క్యాంపెయిన్స్ మరియు చెక్ పాయింట్స్ ద్వారా ఉల్లంఘనుల్ని గుర్తించి అరెస్ట్ చేస్తామనీ, వారిని డిపోర్ట్ చేస్తామనిమినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ - రెసిడెన్సీ ఎఫైర్స్ మేజర్ జనరల్ తలాల్ మరాఫి చెప్పారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!