KGF దర్శకుడితో ప్రభాస్
- January 10, 2019
ప్రభాస్‌లో భారీ సినిమాలు తీసేందుకు అనేక నిర్మాణ సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నారు. సాహో. ఈ ఏడాదిలో రానుంది. ఈ సినిమా బడ్జెట్ 150 కోట్లుగా తేల్చారు. మరో పిరియాడికల్ లవ్ స్టోరీ సినిమాలో కూడా నటిస్తున్నారు. దీనికి రాధాకృష్ణ దర్శకుడు. ఈ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో పూర్తవుతాయి. ఆ తర్వాత ఆయన కమిట్మెంట్ ఏమిటనేది స్పష్టం కాలేదు.
బాహుబలి ప్రేరణలో కన్నడలో తీసిన కేజీఎఫ్ మంచి విజయం పొందింది. ఈ సినిమా దర్శకుడు ప్రశాంత్‌కు మంచి పేరు వచ్చింది. పరిమిత వ్యయంతో సినిమాలు తీసే కన్నడ భాషలో ఇంత పెద్ద భారీ బడ్జెట్ చిత్రం తీసి విజయం సాధించడం మామూలు విషయం కాదు. అందుకే ప్రశాంత్‌తో సినిమా చేసేందుకు పలువురు స్టార్స్ ఆసక్తి చూపుతున్నట్టు తెలిసింది. తాజాగా ప్రశాంత్, ప్రభాస్ కలయికలో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించే అవకాశం ఉందట. గతంలో దిల్ రాజు సంస్థలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమాలో ప్రభాస్ నటించారు. మళ్లి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందని సినీ వర్గాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!