మస్కట్ ఫెస్టివల్: ఈ వస్తువులపై నిషేధం
- January 10, 2019
మస్కట్: 21వ ఎడిషన్ మస్కట్ ఫెస్టివల్, ఈ రోజు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో పెస్టివల్ ప్రాంగణంలోకి కొన్ని వస్తువుల్ని తీసుకెళ్ళకూడదంటూ నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు. కల్నల్ సైద్ అల్ అస్మి, జనరల్ మేనేజర్ - ఆపరేషన్స్ - రాయల్ ఒమన్ పోలీస్ మాట్లాడుతూ, బ్యాన్ చేసిన వస్తువుల వివరాల్ని తెలియజేశారు. బ్యాన్ చేసినవాటిల్లో లైటర్స్, హార్న్స్, నైఫ్స్ వున్నాయి. ఫైర్ క్రాకర్స్, షార్ప్ టూల్స్ - కత్తి లాంటివి అమర్చిన స్టిక్స్, వైట్ వెపన్స్, షార్ప్ ఆబ్జెక్ట్స్, లేజర్ లైటింగ్, ఐరన్ ఛెయిన్స్, విజిల్స్, హార్న్స్, ఫొటోలు కలిగిన క్లాత్స్, రెలిజియస్ వాల్యూస్‌ని దెబ్బతీసేలా రాతలున్న వస్తువులు లేదా క్లాత్స్‌ని ఫెస్టివల్‌లోకి అనుమతించరు. నసీమ్ గార్డెన్, అల్ అమెరాత్ పార్క్ ప్రాంతాల్లో మెయిన్ యాక్టివిటీస్ జరుగుతాయి. ప్రతి రోజూ 4 నుంచి 11 గంటల వరకు వుండే ఈ ఫెస్టివల్, వీకెండ్స్‌లో మాత్రం మరో గంట అదనంగా అంటే 12 గంటల వరకు కొనసాగుతుంది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







