శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. దుబాయ్‌కు వెళ్లే ప్రయాణికుడి నుంచి రూ.40 లక్షల విలువైన విదేశీ కరెన్సీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని మెహిదీపట్నానికి చెందిన మహ్మద్ అలీ బేగ్ విదేశీ కరెన్సీతో దుబాయ్‌కి వెళ్తుండగా అధికారులు పట్టుకున్నారు. విదేశీ కరెన్సీకి సరైన ఆధారాలు చూపకపోవడంతో వాటిని సీజ్ చేసి అలీ బేగ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Back to Top