'పేట':రివ్యూ

- January 10, 2019 , by Maagulf
'పేట':రివ్యూ

రజనీకాంత్ అంటేనే'స్ల్టైల్ ఆఫ్ మేనరిజమ్స్. తెరపై తనదైన మార్కు స్టైల్‌ని క్రియేట్ చేసిన ఆయన ఆ స్టైల్ తో దేశ వ్యాప్తంగా అభిమానగానాన్ని సొంతం చేసుకున్నారు. అయితే అలాంటి ఆయన నుంచి గత కొంత కాలంగా ఆ స్థాయి సినిమా రావడం లేదు. దానికి కారణం ఆయన ఎంచుకున్న కథలే. ఇటీవల వచ్చిన కబాలి, కాలా, 2.ఓ చిత్రాల్లో ఆయన మార్కు మేనరిమ్స్‌తో పాటు రజనీ నుంచి మాస్ ప్రేక్షకులు కోరుకునే మాసీవ్ సన్నివేశాలు చూపించే ఆస్కారం చిక్కలేదు. ఆ లోటును తీర్చే సినిమా వస్తే, బాషా, నరసింహ చిత్రాల్లో కనిపించిన రజనీ మళ్లీ అదే స్థాయిలో తెరపై కనిపిస్తే అభిమానులకు పండగే. అలాంటి కథతోనే పేట చిత్రాన్ని తెరకెక్కించానని మొదటి నుంచీ చెబుతూ వస్తున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తన మాటను నిలుపుకున్నాడా?, రజనీ అభిమానిగా తనకు లభించిన అరుదైన అవకాశాన్ని ఎంత వరకు సద్వినియోగం చేసుకున్నాడు. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చిన పేట రజనీ అభిమానుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంది? అనే విషయాలు తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ

కాళీ( రజనీకాంత్) ఓ రాజకీయ నాయకుడి రికమెండేషన్ వల్ల ఓ హాస్టల్ వార్డెన్‌గా చేరతాడు. అక్కడ జరుగుతున్న సమస్యల్ని తనదైన ైస్టెల్లో పరిష్కరించడం మొదలుపెడతాడు. ఆ తరువాత ఓ ప్రేమ జంటని కలుపుతాడు. ఈ క్రమంలో కాలేజీ విద్యార్థులను ర్యాగింగ్ గ్యాంగ్‌కి గురిచేస్తున్న మైఖేల్, అతని తండ్రితో వైరం మొదలవుతుంది. కాళీని అంతమొందించాలని ప్రయత్నించిన ఆ గ్యాంగ్ స్కెచ్ వేస్తుంది. ఈ క్రమంలో అదే గ్యాంగ్ ముసుగులో హాస్టల్‌లోకి ఉత్తరప్రదేశ్ గ్యాంగ్ చొరబడుతుంది. అప్పుడే తను కాళీ కాదని. అతని అసలు పేరు పేట వీర అని తెలుస్తుంది. పేట వీరకు, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌కు వున్న వైరమేంటి? అక్కడి రాజకీయ నాయకుడు సింగ్ అలియాస్ సింహాచలం పేటను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? పేట అసలు కథేంటి? అనేది తెరమీద చూడాల్సిందే. ఇలాంటి పాత్రల్లో తనదైన మేనరిజమ్స్‌ని జోడించి రక్తికట్టించడంలో రజనీ మాస్టర్. అయితే తన స్థాయికి తగ్గ నటనను ఈ సినిమా ఏ మాత్రం రాబట్టుకోలేకపోయింది. పాత పద్దతిలోనే పగా ప్రతీకారాల నేపథ్యంలో సాగే కథ కావడంతో రజనీ హైవేపే విజిలేస్తూ సాఫీగా ప్రయాణం సాగించినంత్త ఈజ్‌తో పేట పాత్రని సునాయాసంగా చేసేశారు. అయితే సినిమాలోని తొలి భాగంలో రజనీ నడిచే తీరు, యువకుడిగా ఆయన పలికించిన హావబావాలు, సిమ్రన్‌తో సాగే లవ్‌ట్రాక్ ఆకట్టుకుంటాయి. సిమ్రాన్ కనిపించేది తక్కువ సమయమే అయినా ఫరవాలేదనిపించింది. చాలా కాలంగా రజనీతో కలిసి నటించాలని ఎదురుచూసిన త్రిషకు ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. సింహాచలం పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి, జీతూగా విజయ్ సేతుపతి, మాలిక్‌గా శశికుమార్, మేఘా ఆకాష్‌లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అనురుధ్ అందించిన పాటలు సినిమా కథనానికి స్పీడు బ్రేకర్లుగా మారినా నేపథ్య సంగీతం మాత్రం ఆకట్టుకునే స్థాయిలో వుంది. ఓరిస్సా స్థాయినిక కళాకారులతో చేయించి బీజియమ్స్ నేపథ్య సంగీతానికి ప్రాణం పోశాయి. రజనీ సినిమాకు ఓ సగటు అభిమాని ఎలాంటి నేపథ్య సంగీతాన్ని కోరుకుంటాడో ఆ స్థాయి సంగీతాన్ని అందించడంలో అనిరుధ్ సక్సెస్ అయ్యాడు. తిరునవుక్కరసు ఛాయాగ్రహణం, సన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తాయి. రజనీ మార్కు మేనరిజమ్స్, ైస్టెల్స్‌తో కూడిన సినిమా చూడాలని చాలా కాలంగా ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. బాషా, నరసింహా చిత్రాల తరువాత రజనీకాంత్ నుంచి ఆ స్థాయి మాస్ అంశాల మేళవింపుతో సినిమా వచ్చి చాలా కాలమవుతున్నది. ఇటీవల వచ్చిన కబాలి, కాలా చిత్రాల్లో కొంత మేరకు రజనీ ైస్టెల్‌ని చూపించే వీలున్నా కథ డిమాండ్ చేయకపోవడంతో అభిమానుల కల కలగానే మిగిలిపోయింది. ఇక ఆ తరువాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన 2.ఓ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవరసరం లేదు. ఇందులో రజనీ మార్కును చూపించడం అసాధ్యం. దాంతో రజనీ అభిమాని అయిన కార్తీక్ సుబ్బరాజు పేట పైనే అంతా ఆశలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే పేటలో రజనీ మార్కు మెరుపులు వుండేలా కథ రాసుకున్నాడు. ఓ అభిమానిగా రజనీని ఎలా చూడాలనుకున్నాడో అదే స్థాయిలో ప్రజెంట్ చేయడానికి ప్రయత్నించాడు. తొలి భాగంలో జరిగే హాస్టల్ ఎపిసోడ్ నరసింహా, బాషా, ముత్తు చిత్రాలను గుర్తు చేస్తుంది. సిమ్రన్, రజనీల మధ్య వచ్చే సన్నివేశాలు ఇరవైఏళ్ల క్రితం రజనీని మరోసారి కళ్లముందుంచుతాయి. ప్రధమార్థం మొత్తం రజనీ అభిమానుల్ని మెప్పించే కోణంలో ఆలోచించిన కార్తీక్ సుబ్బరాజు కథను పాత పంథాలోనే నడిపించాడు. దీంతో తొలి భాగం పాస్ మార్కులతో గట్టెక్కేసింది. అయితే ద్వితీయార్థాన్ని మాత్రం అంత ప్రభావవంతంగా రాసుకోలేకపోయాడు. పగా ప్రతీకారాల నేపథ్యంలో సాగే రొటీన్ యాక్షన్ డ్రామాకు రజనీ మేనరిజమ్స్‌ను జోడించి నడిపించాలనుకున్నాడు కానీ ద్వితీయార్థం కథ సీరియస్ టర్న్ తీసుకోవడంతో ఎక్కడా రజనీ మార్కు మెరుపులు కనిపించడానికి ఆస్కారం లేకుండా పోయింది. ద్వితీయార్థం మొత్తాన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, పగ, ప్రతీకారాలతో నింపేయడం కబాలి చిత్రాన్ని గుర్తు చేస్తుంది. దానికి భిన్నంగా కార్తీక్ ఆలోచన చేసి కథని ఇంకొంత భిన్నగా రాసుకుని వుంటే పేట ఫలితం మరోలా వుండేది. ఆ విషయంలో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు విఫలమయ్యాడని చెప్పక తప్పదు. అయితే గత కొంత కాలంగా రజనీ మార్కు మేనరిజమ్స్, ైస్టెల్స్ చూడలేకపోతున్నామే అని భావిస్తున్న వాళ్లకు పేట కొంత ఊరటనిస్తుంది.


మాగల్ఫ్ రేటింగ్ 2.5/5

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com