దుబాయ్ పార్క్‌లో మహిళపై అత్యాచారం
- January 14, 2019
ఆసియాకి చెందిన ఓ మహిళపై అత్యాచారం జరిగింది. దుబాయ్ పార్క్‌లో, స్టాఫ్ మెంబర్‌గా నటించిన ఓ వ్యక్తి, బాధిత మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకోగానే రంగంలోకి దిగిన పోలీసులు, నిందితుడ్ని అరెస్ట్ చేశారు. నిందితుడ్ని బంగ్లాదేశీ వ్యక్తిగా గుర్తించారు. బాధితురాలి వయసు 21 ఏళ్ళు కాగా, నిందితుడి వయసు 40 ఏళ్ళు. పార్క్‌లో ఫ్రెండ్‌తో కలిసి కూర్చుని వున్న తనను ఐడీ చూపించాల్సిందిగా ఓ వ్యక్తి తనను కోరారనీ, ఆ తర్వాత 500 దిర్హామ్‌ల జరీమానా విధిస్తున్నట్లు చెప్పారనీ, డబ్బులు తీసుకురావడానికి ఫ్రెండ్ బయటు వెళ్ళగా, నిందితుడు తనపై అత్యాచారం చేసినట్లు బాధిత మహిళ చెప్పింది. ఘటన తర్వాత, నిందితురాలు తన ఫ్రెండ్ వద్దకు వెళ్ళి, ఆ ఫ్రెండ్ సాయంతో పోలీసులకు పిర్యాదు చేయడం జరిగింది. ఫోరెన్సిక్ పరీక్షలో, మహిళ శరీరం నుంచి సేకరించిన శాంపిల్స్, నిందితుడి డీఎన్‌ఏతో మ్యాచ్ అయ్యాయి.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..