కువైట్‌లో 1 మిలియన్ భారతీయులు
- January 14, 2019
కువైట్ సిటీ: కువైట్ అభివృద్ధిలో భారతీయుల పాత్ర చెప్పుకోదగ్గ స్థాయిలో వుందని కువైట్‌లో భారత అంబాసిడర్ జీవ సాగర్ అభిప్రాయపడ్డారు. 'వలసదారుల దినోత్సవం' నేపథ్యంలో జీవ సాగర్ ఈ వ్యాఖ్యలు చేశారు. కువైట్‌లోని డిప్లమాటిక్ కార్ప్స్‌కి సంబంధించిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, సౌత్ ఆఫ్రికాకి చెందిన రాయబారులు కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. సౌతాఫ్రికా, యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా భారతీయులు ఎక్కువగా వున్నారనీ, మహాత్మా గాంధీ ఆయా దేశాల్లో కొంత కాలం నివసించారని ఈ సందర్భంగా జీవ కుమార్ చెప్పారు. ఏ దేశంలో వున్నా భారతీయులు ఆ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని అలవరచుకోవడంతోపాటు, తమ దేశ సంస్కృతీ సంప్రదాయాల్ని కొనసాగిస్తుంటారని జీవకుమార్ చెప్పారు. కువైట్ ప్రభుత్వం, భారత వలసదారులకు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారాయన.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







