టెహ్రాన్ లో కూలిన కార్గో విమానం
- January 14, 2019టెహ్రాన్: ఇరాన్ రాజధాని తెహ్రాన్‌లో సైన్యానికి చెందిన ఓ కార్గో విమానం కుప్పకూలింది. ఆ దేశ మీడియా సమాచారం ప్రకారం విమానంలో ఉన్న 10 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఇరాన్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ప్రతినిధి రీజా జాఫర్జాదేహ్ అక్కడి మీడియాకు వెల్లడించారు. మాంసం సరఫరా చేసేందుకు కిర్గిస్థాన్ రాజధాని బిషెక్ నుంచి ఈ కార్గో విమానం బయల్దేరింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో పైలెట్ విమానం వేరే రన్‌వేపై దించేందుకు ప్రయత్నిస్తుండగా పక్కనే ఉన్న భవనాన్ని ఢీకొట్టి కుప్పకూలిపోయింది.
తాజా వార్తలు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..