ఈ దుస్తులు ధరిస్తే 2,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

- January 14, 2019 , by Maagulf
ఈ దుస్తులు ధరిస్తే 2,000 ఒమన్‌ రియాల్స్‌ జరీమానా

మస్కట్‌: మిలిటరీ దుస్తులు లేదా ఆ తరహా దుస్తుల్ని పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ కన్స్యుమర్‌ ప్రొటెక్షన్‌ (పిఎసిపి) బ్యాన్‌ చేసింది. దుస్తులతోపాటు, ఆ తరహా యాక్సెసరీస్‌ని కూడా ఒమన్‌లో బ్యాన్‌ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పిఎసిపి ఛైర్మన్‌ మినిస్టీరియల్‌ డిక్రీ 9/2019 ప్రకటించిన తర్వాత ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఆర్టికల్‌ 1 - డెసిషన్‌ ప్రకారం మిలిటరీ తరహా దుస్తుల్ని ధరించడం నిషిద్ధం, ఆర్టికల్‌ 2 ప్రకారం ఈ నిబంధనను ఉల్లంఘించినవారికి 50 ఒమన్‌ రియాల్స్‌కి తక్కువ కాకుండా జరీమానా విధిస్తారు. ఒకవేళ పదే పదే నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే 2,000 ఒమన్‌ రియాల్స్‌ వరకూ జరీమానా విధిస్తామని అధికారులు పేర్కొన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com