గణనీయంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
- January 16, 2019
దోహా: ఈ వీకెండ్ మరింత గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నట్లు ఖతార్ మెటియరాలజీ డిపార్ట్మెంట్ అంచనా వేస్తోంది. జనవరి 17 నుంచి 19 వరకు ఈ ప్రభావం వుంటుంది. నార్త్ వెస్టర్లీ విండ్ కారణంగా ఈ ఉష్ణోగ్రతల తగ్గుదల కన్పిస్తోందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు 16 నుంచి 20 డిగ్రీల మధ్యన, అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 నుంచి 14 వరకు వుండొచ్చని అంచనా వేస్తున్నామనీ, కొన్ని ప్రాంతాల్లో 8 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశాలున్నాయని మెటియరాలజీ డిపార్ట్మెంట్ అధికారులు తెలిపారు. విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువగా వుంటుందనీ, సముద్ర తీర ప్రాంతాల్లో కెరటాలు 7 నుంచి 10 అడుగుల మేర వుండొచ్చనీ, ఒక్కోసారి ఇవి 15 అడుగుల వరకు పెరిగినా ఆశ్చర్యం వుండకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా