హాస్యబ్రహ్మ కు హార్ట్ సర్జరీ!
- January 16, 2019
ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందంకు ముంబైలోని ఓ ఆసుపత్రిలో హార్ట్ సర్జరీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. గత ఆదివారం అనారోగ్యంతో ముంబైలోని ఏషియన్ హర్ట్ ఇన్సిస్టిట్యూట్లో చేరిన ఆయనకు సర్జరీ అవసరమని డాక్టర్లు సూచించారు. డాక్టర్ రమాకాంత్ పాండా ఆధ్వర్యంలో సోమవారం ఆయనకు సర్జరీ జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మానందం ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభిమానులు సోషల్ మీడియాలో ట్వీట్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆయన కుమారులు గౌతమ్, సిద్ధార్థ్లతో పాటు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారు. వెయ్యికి పైగా సినిమాల్లో నటించి హాస్యలోకపు రారాజుగా వెలుగొందిన బ్రహ్మానందంకు ఇటీవల సినిమాలు తగ్గాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!