'TKS-ఒమన్' ఆధ్వర్యంలో 'స్వరవారధి'

- January 18, 2019 , by Maagulf
'TKS-ఒమన్' ఆధ్వర్యంలో 'స్వరవారధి'


మస్కట్‌:ఒమన్ దేశ రాజధాని మస్కట్ మహా నగర మందు, ఇండియన్ సోషల్ క్లబ్ వారి అద్వర్యం లో, తెలుగు వారి సమైక్యతకు కృషి చేస్తున్న మన "తెలుగు కళా సమితి"  ప్రతి సంవత్సరం ఉగాది మొదలు సంక్రాంతి వరకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.


"మారుతున్న కాలం తో కనుమరుగవకుండా" మాతృభాష బోధనను “పాఠశాల”  ద్వారా మరియు సమకాలీన సమాజం లో కావలసిన నైపుణ్యం కోసం "Toastmasters" ను నడపటం జరుగుతోంది. అంతే కాక, వివిధ రంగాలలో నైపుణ్యం కనపరచిన మన తెలుగు వారిని గుర్తించి తగు ప్రోత్సాహకాలు (Awards) ప్రకటిస్తూ తద్వారా యావత్ తెలుగు వారికీ, ఆదర్శవంతమైన వృద్ధికిగాను,  ఒక ప్రేరణ కలిగిస్తోంది.


"తెగల వారము" కాదు మనము "తెలుగు వారము" ఎప్పుడు అంటూ ఇక్కడ నివసిస్తున్న తెలుగు వారంతా "తెలుగు కళా సమితి" అధ్యక్షులు అనిల్ కుమార్ కడించర్ల మరియు కార్యవర్గ సభ్యులు తలపెట్టిన అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతోంది. 


ఎప్పటికప్పుడు వినూత్న కార్యక్రమాలను మీ ముందు ఉంచటం లో కృషిచేస్తున్న తెలుగు కళా సమితి కార్యవర్గం ఈ 2019 (౨౦౧౯) సంవత్సరపు సంక్రాంతి మరియు గణతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని సరిక్రొత్త ఆలోచన చేసింది. 


"దేశ భాషలందు తెలుగు లెస్స" అన్న ఆ శ్రీ కృష్ణదేవరాయల మాటను నిజం చేస్తూ "తేట తెలుగు పాట - దేశ ప్రజల నోట" వింటూ ఆస్వాదించేలా సంగీత విభావరి "స్వర వారధి" ని మీ ముందుకు తెస్తోంది.
మన స్వస్థలం మరియు స్థానిక తెలుగు వారే కాక వివిధ రాష్ట్రాలు, దేశాలకి చెందిన గాయని గాయకులతో జనవరి 26 (౨౬) వ తేదీ సాయంత్రం " స్వర వారధి : సుమధుర బాణీ - తెలుగు వాణి" కార్యక్రమ కల్పన చేసింది.


అంతేకాక మనందరి కోరిక మేర, తన ముప్పై పైబడి వసంతాల తెలుగు చలన చిత్ర సాహితి గమనం లో, "విలువలున్న పాట - వేయేళ్లు వర్ధిల్లు" అన్న భావనకు నిలువెత్తు రూపమై, ఎన్నో రచనలతో ఎంతో మంది తెలుగు వారి జీవితాలను ప్రభావితం చేసిన, చేస్తున్న, పరిచయం అక్కరలేని, సరస్వతి మానస పుత్రులు, నిత్య యవ్వనులు,  'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి  ముఖ్య అతిధి గ మన "స్వర వారధి" కి విచ్చేయనున్నారు.


సిరివెన్నెల గారితో పటు వారి తనయులు, సంగీత దర్శకులు అయిన “యోగేశ్వర్”, తన నటన, గానం, వ్యాఖ్యానం ల తో అల్ రౌండర్ (All Rounder) గ పేరుగాంచిన “కిరణ్ గారు” మరియు  (FACE BOOK) ఫేస్బుక్ ద్వారా ప్రాచుర్యం పొందిన గాయని "బేబీ” మన అందరిని అలరించటానికి విచేయుచున్నారు. 


"ఆలోచనలకు హద్దు ఆర్థిక వనరులే" కావున తెలుగు కళా సమితి చేపడుతున్న కార్యక్రమాలకు మేమున్నాం అంటూ ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్న అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తోంది. అందునా "సిరిసంపద గ్రూప్ (SIRI SAMPADA Group)" మనకు వార్షిక భాగస్వామిగా ఉంటూ అనేక కార్యక్రమాలకు అండగా నిలవటం అభినందనీయం.ఈ కార్యక్రమానికి మాగల్ఫ్.కామ్ మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తోంది 

 

 

 

 

 

 

 

 

 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com