యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరిక

- January 18, 2019 , by Maagulf
యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరిక

యూఏఈ:యూఏఈలో భారత వలసదారులకు ఎంబసీ హెచ్చరికలు జారీ చేసింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ పట్ల అబ్రీపమత్తంగా వుండాలని ఎంబసీ, ట్విట్టర్‌ ద్వారా భారత వలసదారుల్ని అప్రమత్తం చేసింది. 02-4492700 నంబర్‌ ద్వారా వచ్చే ఫోన్‌ కాల్స్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వసించరాదనీ, ఆ నంబర్‌ ద్వారా మోసగాళ్ళు బ్యాంక్‌ అకౌంట్‌ డిటెయిల్స్‌ సేకరించడం, లేదా తమ ఖాతాల్లోకి డబ్బులు పంపించాలని కోరడం జరుగుతోందని ఎంబసీ పేర్కొంది. ఎవరికైనా ఒకవేళ ఆ నంబర్‌ నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చినా, అలాంటి కాల్స్‌ ఇతర నంబర్ల నుంచి వచ్చినా వెంటనే సంబంధిత అధికారులకు పిర్యాదు చేయాలని ఎంబసీ సూచించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com