లద్ధాఖ్‌లో హిమపాతం..5 మృతి, 7 గల్లంతు
- January 18, 2019
జమ్ముకశ్మీర్‌లోని లద్ధాఖ్ ప్రాంతంలో హిమపాతం సంభవించి ఐదుగురు మృతిచెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారు. ఖర్దుంగ్ లా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఖర్దుంగ్ లా పాస్ మంచు చరియలను ఢీకొట్టింది. దీంతో వీరంతా హిమపాతంలో చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు, ఆర్మీ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాలను వెలికితీయగా.. మిగతా వారి కోసం సహాయకసిబ్బంది గాలిస్తున్నారు. 17,500 అడుగుల ఎత్తులో వీరు గల్లంతైనట్లు తెలుస్తోంది. ఖర్దుంగ్ లా దేశంలో ఎత్తైన రహదారి మార్గాల్లో ఒకటి. లేహ్ జిల్లాలో ఉండే ఈ రోడ్డు షయోక్, నుబ్రా లోయలను కలుపుతుంది.
కశ్మీర్‌లోయలో చలి తీవ్రత విపరీతంగా ఉంది. గురువారం కూడా పలు ప్రాంతాల్లో దట్టంగా మంచు కురిసింది. జనవరి 23 వరకు వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో హిమపాతం ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల వైపు వెళ్లొద్దని ప్రజలను సూచిస్తున్నారు. అనంత్‌నాగ్, కుల్గాం, బుద్గాం, బారాముల్లా, కుప్వారా, బాందిపొరా, కార్గిల్, లేహ్ జిల్లాల్లో మంచు చరియలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!







